జీశాట్​1 ప్రయోగం వాయిదా

టెక్నికల్​ ఇష్యూలే కారణమన్న ఇస్రో

న్యూఢిల్లీ: టెక్నికల్​ ఇష్యూల కారణంగా జీశాట్​ 1 ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. ఈ శాటిలైట్‌ను తిరిగి ఎప్పుడు ప్రయోగించేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. ఇస్రో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జీశాట్​1 శాటిలైట్​ను మార్చి 5(గురువారం) ప్రయోగించాలి. సతీష్​ ధావన్​ స్పేస్​ సెంటర్​లో దీనికోసం సైంటిస్టులు ఏర్పాట్లు కూడా చేశారు.జీఎస్ఎల్వీఎఫ్​10 రాకెట్​లో శాటిలైట్‌ను చేర్చి, కౌంట్​డౌన్​ కూడా స్టార్ట్ చేశారు. చివరి నిమిషంలో టెక్నికల్​ కారణాలతో ప్రయోగాన్ని ఆపేశారు. కౌంట్​డౌన్​ నిలిపేసినట్లు ఇస్రో ట్విట్టర్లో వెల్లడించింది. అంతరిక్షం నుంచి భూమిని నిరంతరం పరిశీలిస్తూ రియల్​ టైమ్​ ఫొటోలను పంపడం, ప్రకృతి విపత్తులను మానిటర్​ చేయడం కోసం సైంటిస్టులు ఈ శాటిలైట్​ను ప్రయోగిస్తున్నారు.  మన దేశం చేపట్టిన తొలి జియోస్టేషనరీ ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​ ప్రయోగం ఇదే.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

Latest Updates