మెహదీపట్నంలో వోక్స్‌వ్యాగన్‌ ఇండియా కస్టమర్‌ టచ్‌ పాయింట్

హైద‌రాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌ ఇండియా నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్‌ను నగ‌రంలోని మెహదీపట్నంలో ప్రారంభించినట్లు తెలిపింది. జ్యోతినగర్‌లో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన 3ఎస్‌ సదుపాయాల‌తో ప్రారంభ‌మైన ఈ ట‌చ్ పాయింట్‌ మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ నీహార్‌ మోదీ నాయకత్వంలో నిర్వహించబడుతుంది.

హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద నూతన సదుపాయాన్ని ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా కస్టమర్‌ టచ్‌ పాయింట్లను విస్తరించాలనే సరైన దిశలో వోక్స్‌వ్యాగన్‌ వెళ్తుందని బ్రాండ్‌ హెడ్‌–వోక్స్‌ వ్యాగన్‌ పాసెంజర్‌ కార్స్‌ ఇండియా ప్రతినిధి అశీష్ గుప్తా పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మా నెట్‌వర్క్‌కు వోక్స్‌వ్యాగన్‌ మెహదీపట్నం టచ్‌పాయింట్‌ జోడింపుతో మేము మా వినియోగదారులకు మరింత చేరువయ్యామని మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ నిహార్‌ మోదీ అన్నారు.

Latest Updates