ఎమర్జెన్సీలో ఫ్రీ క్యాబ్ సర్వీస్

బషీర్ బాగ్, వెలుగు: లాక్ డౌన్ టైమ్ లో హైదరాబాద్ లో ఎమర్న్సీ సేవలకు ఫ్రీ జె క్యాబ్ ఫెసిలిటీ అందించేందుకు మహీంద్రా ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థ ముందుకొచ్చింది. బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ అంజనీకుమార్ మంగళవారం ఈ సేవలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ సేవల కోసం 24 గంటల పాటు 7 జె క్యాబ్ లు అందుబాటులో ఉంటాయన్నా రు. సీనియర్ సిటిజన్స్, గర్భిణులు, చిన్నారులు హెల్త్ ప్రాబ్లమ్స్ టైమ్ లో వాటిని వాడుకోవచ్చన్నారు. క్యాబ్ బుకింగ్ కోసం 84339 58158 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

Latest Updates