పేలిన తాల్ అగ్ని పర్వతం.. 286 విమానాల రద్దు

ఫిలిప్పీన్స్‌ దేశంలోని తాల్ అగ్నిపర్వతం సోమవారం పేలింది. పేలుడుతో భారీగా లావా ప్రవహించింది. దీంతో 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగతో ఫిలిప్ఫీన్స్ దేశంలో సోమవారం 286 విమానాల రాకపోకలను రద్దు చేశారు. అగ్నిపరత్వం పేలుడు కారణంగా వ్యవసాయ భూములు, భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మనీలా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లావా ప్రవహించడంతో దుమ్ముధూళి వ్యాపించింది. దీంతో స్కూళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest Updates