వారానికి 4 రోజులే పని, 3 రోజులు వీక్ ఆఫ్

law-firm-gives-staff-four-day-week-and-a-pay-rise
  • ఉద్యోగులందరికీ హైక్
  • బ్రిటన్​ న్యాయ సంస్థ నిర్ణయం

లండన్​: వారానికొకటి వచ్చే వీక్​ ఆఫ్ లో ఏం చేస్తుంటారు? చేసేదేముం టది.. వచ్చినంతలోనే ఆ రోజు గడుస్తది అంటరా! ఓకే..ఓకే.. రెం డ్రోజులిస్తే.. కొంచెంఎంజాయ్​ చేయొచ్చం టారా! సరే..సరే.. మరి మూడ్రోజులు వీక్​ ఆఫ్ అయితే.. ఏం చేస్తరు?  ఎవడిస్తడని ఎదురు ప్రశ్నించకండే..! బ్రిటన్ లో ని ఓ కంపెనీ మూడ్రోజులు వీక్​ఆఫ్ ఇచ్చి జాలీగా గడిపేయమంటోంది.వారానికి నాలుగురోజులే పని అంటూ కొత్త రూల్​ తీసుకొచ్చిం ది. అంతేకాదండోయ్​.. ఉద్యోగులందరికీ భారీగా జీతాలు కూడా పెంచింది. ఆ కంపెనీ ఏది..అన్ని లాభాలొస్తున్నయా దానికి అని అడుగుతరా? ప్లైమౌత్ లో ని పోర్ట్ కల్లిస్ లీగల్స్​ అనే సంస్థ ఉద్యోగులకు ఈ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. కంపెనీ అంత మంచి ఆఫర్​ ఇస్తే ఎవరైనా ఊరుకుం టారా.. ఉద్యోగులంతాఎగిరి గంతేశారు. మస్తు ఖుష్ అవుతున్నా రు. తమ బాస్ ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా ఎక్కువ అంకితభావంతో పనిచేస్తున్నారు.

నాలుగు రోజులే పని అని చెప్పడంతో ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని, తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని కంపెనీ ఎండీ ట్రెవర్​ వర్త్​ చెప్పారు.30 ఏళ్ల ఎక్స్​పీరియన్స్​లో కంపెనీకి రెండు అవార్డులు కూడా వచ్చాయి. లా అంటేనే గొట్టు గొట్టు పదాలుంటాయి. జనానికి అర్థం కావు. కానీ, కంపెనీ మాత్రం అందరికీ అర్థమయ్యే భాషలోనే న్యా య సేవలను అందిస్తోంది. రెండుసార్లు ప్లైమౌత్ బిజినెస్ అవార్డును గెలుచుకుం ది. ఈ కంపెనీలో ఉన్నది తక్కువ రోజులు పనిచేయడం వల్ల ఉద్యోగు లు మరిం త మెరుగ్గా పనిచేస్తూ కంపెనీల లాభాలు పెం చుతున్నారని ఇటీవల న్యూజిలాం డ్ లో ఓ ఆర్థిక సంస్థ చేసిన సర్వేలో తేలిం ది. దీని వల్ల ఉద్యోగులకే కాదండోయ్​.. పర్యావ-రణానికీ మేలేనంటున్నా రు పర్యావరణ నిపుణులు.ఇలా నాలుగు రోజులే పని చేయడం వల్ల ప్రపంచం పెట్టుకున్న 2 డిగ్రీల ఉష్ణో గ్రత లోపలే గ్లోబల్​ వార్మింగ్​ ఉంటుందని అంటున్నా రు.

Latest Updates