టైమ్స్ జాబితాలోమన లేడీ లాయర్లు

Lawyers Arundhati Katju and Menaka Guruswamy feature in TIME's magazine
  • రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకీ చోటు

న్యూయార్క్​: ప్రఖ్యాత టైమ్స్​ మ్యాగజీన్​ ఏటా ప్రకటించే ‘ప్రపంచ  ప్రభావ శీలుర’ జాబితా ఈసారి మరింత ప్రత్యేకంగా నిలిచింది. బుధవారం టైమ్స్ ప్రకటించి న 100 మంది పేర్లలో భారతీయ మహిళా లాయర్లు అరుంధతి ఖట్జూ, మేనకా గురుస్వామిలకు చోటు దక్కింది. రిలయన్స్​ అధినేత ముఖేశ్​ అంబానీకి కూడా ఈ గౌరవం దక్కింది.  ఇండియన్​ అమెరికన్​ టీవీ హోస్ట్​ హసన్​ మినాజ్​ కూడా జాబితాలో చోటు పొందాడు. సుప్రీంకోర్టులో లాయర్లుగా ప్రాక్టీస్​ చేస్తున్న అరుంధతి, మేనక.. దశాబ్దం పైబడి ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్​ 377 కొట్టివేతలో వీళ్లిద్దరూ కీలక పాత్ర పోషించారు. టైమ్స్​ పయనీర్స్​(మార్గదర్శకుల) విభాగంలో చోటుదక్కించుకున్న ఈ ఇద్దరి గురించి మ్యాగజైన్​లోనటి ప్రియాం క చోప్రా రాయగా, ముఖేశ్​ అంబానీ ప్రత్యేకతను మరో ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్మహీంద్రా వివరించారు. నెట్ ఫ్లిక్స్​లో ప్రసారమైన‘పేట్రియాట్ యాక్ట్​’ సిరీస్​తో పాపులరైన టీవీ హోస్ట్​ హసన్​ మినాజ్​పై కెనడియన్​ పొలిటికల్ కామెంటేటర్ ట్రెవర్ నోవా వ్యాసం రాశారు. పయనీర్స్​,ఆర్టిస్టులు, లీడర్స్​, ఐకాన్స్​, టైటాన్స్ అనే ఐదు విభాగాల్లో మొత్తం 100 మంది పేర్లను ప్రకటిం చారు. ఈ ఏటి జాబితాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్​, యూఎస్​ ఓపెన్​ విన్నర్ నవోమీ ఒసాకా, నటుడు మహర్షలా అలీ, రమీ మలేక్ , మాజీ ఫస్ట్​లేడీ మిచెల్లీ ఒబామా, సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్​ రమఫోసా,సింగర్ లేడీగాగా, దుబాయ్​ యువరాజు మొహ్మద్ బిన్​ జెయేద్ , ట్రంప్–రష్యా సంబంధాలపై దర్యాప్తు చేసిన కౌన్సిలర్ రాబర్ట్​ ముల్లర్ కు చోటుదక్కింది.

Latest Updates