నిలదీస్తారనే కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి వస్తలేరు

జనం నిలదీస్తారనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావటం లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . భూత్పూర్ , పాలమూరు మున్సిపాలిటీల్లో ఆయన మున్సిపల్ ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకునే మజ్లిస్ పార్టీకి పాలమూరు ఛైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రచారానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. పాలమూరును అమృత్ సిటీగా మార్చాలంటే బీజేపీని గెలించాలని కోరారు లక్ష్మణ్.

Latest Updates