మా ఇంట్లో బుడ్డ ఎన్టీఆర్ పుట్టాడు..నా భర్త ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలి

ఎంతో మందికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో పూలమాలు వేసి నివాళులర్పించిన ఆమె..తన ఇంట్లో బుడ్డ ఎన్టీఆర్..మనవడు జన్మించాడని చెప్పారు. ఆయన ఆశయ స్పూర్తితో తన భర్త ఆశీస్సులు ఆ బిడ్డ పై ఉండాలన్నారు. ఏపీలో 25 సంవత్సరాలు నుంచి ఎలాంటి దగా కోరు రాజకీయాలు నడిచాయో ఇప్పటికీ అవే నడుస్తున్నాయన్నారు.

ఇప్పటికి తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ ముందుకెళ్లదన్నారు. ప్రతీ  నాయకుడు ఆయన ఆశయాలతో ముందెకెళ్తున్నాడని..అందుకే ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి పరిపాలన జరుగుతుందన్నారు. ఎన్టీఆర్  సుపరిపాలన అందరికి ఆదర్శం కావాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనే శ్రీరామ రక్ష అని అన్నారు.

see more news

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చిరుత

నువ్వే నా హీరో.. మిస్‌ యూ డాడీ  

హాస్పిటల్ పై నుంచి దూకి కరోనా పేషెంట్ సూసైడ్

ఎన్టీఆర్ గురించి మాట్లాడడమంటే సూర్యుడిని వేలుతో చూపించినట్టే

Latest Updates