ట్రైలర్ రిలీజ్ : గ్లామరస్ వెంకటలక్ష్మి..

రాయ్ లక్ష్మీ లీడ్ రోల్ లో నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి ట్రైలర్ రిలీజైంది. కృష్ణ కిషోర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని  ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో … నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ట్రైల‌ర్ లో రాయ్ ల‌క్ష్మీ గ్లామర్ గా కనిపించి.. యూత్‌ కి మాంచి కిక్కిస్తుంది.

ఇటీవల రిలీజైన టీజర్ ఆకట్టుకోగా ..ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. రామ్ కార్తిక్ హీరోగా న‌టించగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. అయితే 2 నిమిషాల 16 సెకన్లున్న ఈ ట్రైలర్‌‌లో లక్షీరాయ్, పూజిత పొన్నాడలు పోటీపడి మరీ గ్లామర్ గా కనిపించారు. ఖైదీ నెం 150 సినిమాలో ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్షకుల‌ని ఓ ఊపు ఊపిన రాయ్ ల‌క్ష్మీ ..త్వరలోనే వెంకటలక్ష్మితో రానుందన్నమాట.

Latest Updates