LB స్టేడియం ముస్తాబు : ముస్లింలకు సీఎం ఇఫ్తార్ విందు

CM-KCR-Iftarపవిత్ర రంజాన్‌ ఉపవాసాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు శుక్రవారం(జూన్-8) దావత్‌-ఏ-ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది. ఉపవాస దీక్ష విరమించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో సుమారు 4 లక్షల మందికి ఇఫ్తార్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం(జూన్-8) ముస్లిం సోదరులకు మెగా ఇఫ్తార్‌ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలతో పాటు వివిధ దేశాలకు చెందిన రాయబారులు కూడా పాల్గొననున్నారు. దాదాపు 8 వేల మందికి ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లు చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 400 మసీదులు, జిల్లాల పరిధిలో 400 మసీదుల్లో కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు మసీదుల చొప్పున ప్రతీ మసీదు కమిటీ ఆధ్వర్యంలో కనీసం 500 మందికి తగ్గకుండా పండ్లు, బిర్యానీ, స్వీట్లు సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. దీని కోసం మసీదుకు రూ.లక్ష చొప్పున సుమారు రూ.8 కోట్లను ఆన్‌లైన్‌ ద్వారా కమిటీలకు అందజేశారు.

 

Posted in Uncategorized

Latest Updates