కన్నకొడుకుని అమ్మిన తల్లి అరెస్ట్

ఎల్ బీ నగర్,వెలుగు : డబ్బుల కోసం కన్నకొడుకును అమ్ముకున్న తల్లితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించారు.సీఐ అశోక్ రెడ్డి కథనం ప్రకారం..సికింద్రాబాద్ లో ఉంటున్న డెరంగుల విజయలక్షికి, రమేశ్ తో ఎనిమిదేళ్ళ క్రితం వివాహం అయ్యింది.వీరికి 2018 అక్టోబర్ లో బాబు పుట్టాడు.కొద్ది రోజులకు రమేశ్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో విజయలక్షి రమేష్ ను వదిలేసి కొడుకుతో సహా వచ్చి ఎల్ బీ నగర్  గుంటిజంగయ్య నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటుంది..భర్త లేకపోవడం కుమారుని పోషణ  భారమవ్వడంతో తన కొడుకుని డబ్బులకు అమ్మాలని విజయలక్ష్మి నిర్ణయించుకుంది.ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ చేతన్ పళ్లికి చెందిన ఒరగంటి మోషేకు ఈనెల 20న రూ. 60 వేల రూపాయలకు తన కొడుకు అఖిల్(11 నెలలు)ను విజయలక్ష్మి అమ్మేసింది.తాను నివాసం ఉంటున్న గుంటి జంగయ్య కాలనీలో స్థానికులను నమ్మించేందుకు తను స్పృహ తప్పి పడిపోయానని ఆ సమయంలో ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి తన కొడుకును కిడ్నాప్ చేశారని ఎల్బీనగర్ పోలీసులకు విజయలక్ష్మి కంప్లయింట్ చేసింది.పోలీసులు అనుమానంతో విజయలక్ష్మి విచారించగా తానే తన కుమారుని రూ. 60 వేలకు అమ్ముకున్నట్లు ఒప్పుకుంది.దీనితో పోలీసులు శనివారం విజయలక్ష్మిని, మోషే ని అరెస్ట్ చేశారు. బాలుడిని  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో శిశు విహార్ కు తరలించారు.

 

Latest Updates