ప్రతీ ప్రైవేట్ టీచర్ కు రూ. 10 వేలివ్వాలి

కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు ఎమ్మెల్సీ రాంచందర్ రావు. కరోనాతో ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్బులు, సినిమా థీయేటర్లను తెరిచిన ప్రభుత్వం స్కూళ్లను ఎందుకు రీ ఓపెన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకుని రూ. 10వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కూళ్లు తెరిచాక టీచర్లు, విద్యార్ధులపై ప్రభావం పడకుండా ప్రాపర్టీ టాక్స్ మినహాయించాలన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉపాధ్యాయుడు సంజీవ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన ప్రైవేట్ టీచర్లకు కండువాకప్పి ఆహ్వానించారు.

ఎంపీలకు ప్రోటోకాల్ ఏది?.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా

గవర్నర్ ను తొలగించాలని ఆందోళనకు దిగిన సీఎం

Latest Updates