తండ్రిని హత్య చేసిన కొడుకుకి జీవిత ఖైదు

lb-nagar-second-megistrate-court-has-sentenced-a-son-to-life-imprisonment-for-murdering-his-father

ఎల్ బీ నగర్,వెలుగు: తాగేందుకు  పైసలు ఇవ్వడం లేదని తండ్రితో గొడవపడి హత్య చేసిన కేసులో కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ ఎల్ బీ నగర్ లోని 2వ జిల్లా అధనపు కోర్టు తీర్పునిచ్చింది. వివరాలలోకి వెళితే నల్లగొండ జిల్లా పోచంపల్లికి చెందిన చెన్నబతిని యాదగిరి గత కొన్నేళ్ళ క్రితం నగరానికి వచ్చి హయత్ నగర్ కుంట్లూర్ లో నివాసం ఉంటున్నాడు.యాదగిరికి రమేశ్,సారయ్య అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.

బార్యా ఇద్దరు కొడుకులతో పాటు తన మేనకోడలుతో కలిసి ఉండేవారు. గత నాలుగేళ్ల క్రితం రమేశ్(26) కు పెద్ద అంబర్ పేట్ కు చెందిన స్వప్న అనే మహిలతో వివాహం అయ్యింది. కొద్ది రోజులు భాగానే ఉన్న బార్యభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి.అప్పటి నుండి రమేష్ మధ్యానికి, చెడువ్యసనాలకు అలవాటు పడి రోజు మధ్యం సేవించి ఇంటికి వస్తుండటంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇలానే రోజు మధ్యం మత్తులో ఇంటికి వచ్చే రమేష్ తన తాగుడుకు డబ్బులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులతో పాటు మేనకోడలిని కొట్టేవాడు. ఈ విషయంలో ఇక ఇంటికి రావద్దని బయట ఎక్కడైనా ఉండమని రమేష్ ను తండ్రి మందలించడంతో తండ్రిపై రమేష్ పగ పెంచుకున్నాడు. రోజులానే జులై 3 2016న మధ్యం సేవించి ఇల్లు చేరిన రమేష్ తల్లి, మేనకోడలును చితకబాదాడు అడ్డుకోబోయిన తండ్రి యాదగిరిపై ధాడి చేసి సిమెంట్ ఇటుకతో తలపై మొది హత్య చేశాడు.

ఇదే కేసులో యాదగిరి పెద్ద కొడుకు సారయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హయత్ నగర్ పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి చార్జ్ షీట్ ఫైల్ చేయడంతో సాక్షాలను విచారించిన కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

Latest Updates