ఇక ప్రచారం పరుగులే.

Leaders are busy with election Campaign
  • రంగంలోకి మోడీ, రాహుల్ , కేసీఆర్
  • ​29 నుంచి వరుసగా కేసీఆర్‌ సభలు
  • ఆరు రోజుల్లో 11 సమావేశాలు
  • 29న మహబూబ్​నగర్​లో,1న హైదరాబాద్ లో మోడీ సభలు
  • త్వరలోనే ప్రచారానికి రానున్నకాం గ్రెస్ చీఫ్​ రాహుల్​గాం ధీ
  • ఆరు నుంచి ఎనిమిది సభలకు ప్లాన్‌
  • అన్ని పార్టీల నుంచి పోటాపోటీగా సభలు, రోడ్‌ షోలు
  • రాష్ట్రవ్యా ప్తంగా హోరెత్తనున్న ప్రచారం

 

హైదరాబాద్‌, వెలుగు:రాష్ట్రం లో లోక్ సభ పోలిం గ్ కు రెండు వారాలే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్నిహోరెత్తిం చనున్నా యి. కీలక నేతలతో సభలు,రోడ్​షోలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ శుక్రవారం (29వ తేదీ) నుంచి వరుసగా సభల్లో పాల్గొననున్నా రు. ఆరు రోజుల పాటు 11 నియోజకవర్గాల్లో కేసీఆర్​ సభలు నిర్వహించేలా టీఆర్​ఎస్​ షెడ్యూల్ ఖరారు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ కూడా వరుసగా సభలు,రోడ్​షోలు నిర్వహించనున్నా రు. అటు బీజేపీ తరఫున ప్రధాన మంత్రి మోడీ ప్రచార సభలు కూడా ఖరారయ్యాయి. 29నమహబూబ్ నగర్ లో, వచ్చేనెల 1న హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభల్లో మోడీ పాల్గోంటారు.అటు కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఏడెనిమిదిసభల్లో పాల్గొంటారని, వచ్చే నెల 1 తర్వాత ఆయన పర్యటన ఉంటుందని పీసీసీ వర్గాలు చెప్పాయి .ప్రియాంక గాంధీ కూడా ప్రచారానికి వచ్చే అవకాశముందని తెలిపాయి.

దూకుడుగా టీఆర్ ఎస్..

లోకసభ ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్‌‌ఎస్‌‌ ఇప్పటికే ఒక అడుగు ముందంజలో ఉంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. తర్వాత కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌లలో సీఎం కేసీఆర్‌‌ సభలు నిర్వహించింది. తాజాగా ఈనెల 29 నుంచి ఆరు రోజుల పాటు మరో 11 నియోజకవర్గాల్లో సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో ఆదిలాబాద్‌‌లోని రెండు సెగ్మెంట్లు మినహా రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో కేసీఆర్‌‌ సభలు జరుగనున్నాయి.  వచ్చే నెల 4 తర్వాత మిగతా సెగ్మెంట్లలో సభలు నిర్వహించే అవకాశముంది. ఇక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ కూడా 13 రోజుల్లో ఎనిమిది లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో 37 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ తరఫున 20 మంది స్టార్‌‌ క్యాంపెయినర్లు రోడ్‌‌ షోలు, ర్యాలీల్లో ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం,కేసీఆర్‌‌ బ్రాండ్‌‌ నేమ్‌ ఆధారంగా ప్రజల్లో కి చొచ్చుకుపోవాలని టీఆర్‌‌ఎస్‌‌ భావిస్తోంది. ఈ అంశాలే తమని ఎన్నికల్లో గెలిపిస్తాయన్న ధీమాతో ఉంది.

మోడీ పర్యటన ఖరారు

బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈనెల 29న మహబూబ్‌‌నగర్‌‌లో నిర్వహించే బహిరంగసభకు మోడీ హాజరవుతారు. మహబూబ్‌‌నగర్‌‌, నాగర్‌‌ కర్నూల్‌‌ లోక్ సభ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఇదే సభలో టీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ లీడర్‌‌ జితేందర్‌‌రె డ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చేనెల 1న హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడి యంలో నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొని.. సికింద్రాబాద్‌‌, మల్కాజిగిరి, హైదరాబాద్‌‌, చేవెళ్ల అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.మరో రెండు, మూడు చోట్ల మోడీ సభలు, ఐదారు చోట్ల అమిత్ షా సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. వీరితోపాటు పలువురు కేంద్ర మంత్రులు,బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారంలోపాల్గొంటారని సమాచారం.

వచ్చే నెలలోనే రాహుల్..

లోక్ సభ ప్రచార పర్వం లో కాంగ్రెస్ కొంత వెనకప-డింది. అభ్యర్థులు తమ సెగ్మెంట్లలో ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌‌లు కాంగ్రెస్‌‌కు మద్దతు ప్రకటించడంతో వారి ఓటు బ్యాంకు కలసివస్తుందని ఆశిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత రాహుల్ గాంధీ రా ష్ట్రానికి వస్తారని, ఆరు నుంచి ఎనిమిది సభలు ఏర్పాటు చేసే అవకాశముందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైకమాండ్ కు  షెడ్యూల్‌‌ పంపించామని, దానికి ఆమోదం రావడమే ఆలస్యమని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రచారం కోసం ప్రియాంక గాంధీని తీసుకురావాలని, కనీసం ఒక సభలోనైనా పాల్గొనేలా చూడాలని హైకమాండ్ ను కోరినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ స్టార్  క్యాం పెయినర్లు విస్తృతంగా ర్యాలీలు, రోడ్
షోలు నిర్వహించనున్నారు.

టీఆర్‌‌ఎస్‌‌కు హెలికాప్టర్‌‌ అనుమతి

ఎన్నికల ప్రచారం కోసం టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్, సీఎంకేసీఆర్‌‌ హెలికాప్టర్‌‌ వినియోగించుకునేందుకు సీఈవో రజత్‌‌కుమార్‌‌ మంగళవారం అనుమతి ఇచ్చారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్‌‌ 4 వరకు ఆరురోజుల పాటు.. 8 మంది ప్రయాణించగల గ్లో బల్‌‌ వెక్ట్రా కంపెనీ -ఏడబ్ల్యూ 169 హెలికాప్టర్‌‌ను కేసీఆర్‌‌ ఎన్నికల ప్రచారానికి వినియోగించనున్నారు.

 

నేటి నుంచి 13 రోజులపాటు కేటీఆర్ బిజీబిజీ

టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌ ప్రె-సిడెంట్‌ కేటీఆర్‌‌ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. 13 రోజుల్లో 8 లోక్ సభ సెగ్మెం-ట్ల పరిధిలో 37 బహిరంగ సభలు, రోడ్ షోల్లోకేటీఆర్ పాల్గ ొం టారు. బుధవారం ఉదయంపది గంటలకు తన సొంత సెగ్మెంట్​ సిరిసిల్లలోనిముస్తాబాద్‌‌ మండలంలో పార్టీ కరీంనగర్‌‌ అభ్య-ర్థి బి.వినోద్ కుమార్ తరఫున ప్రచారం చేస్తారు.29న సిరిసిల్ల సెగ్మెంట్​లోని ఎల్లారె డ్డి, వీర్నపల్లిమండలాల్లో , కరీంన గర్‌‌లో రోడ్ షో, సభల్లోపాల్గ ొంటారు. 30న మహబూబాబాద్‌‌ అభ్యర్థితరపున నర్సంపేట, ములుగు బహిరంగ సభల్లోపాల్గ ొంటారు. తాండూర్‌‌, వికారాబాద్ ల్ లో చేవెళ్లఎంపీ అభ్యర్థి తరపున రోడ్ షోలు నిర్వహిస్తారు.31న సిరిసిల్ల గంభీరావుపేట, పరిగి, చేవెళ్లలోరోడ్ షోల్లో పాల్గ ొంటారు. ఏప్రిల్‌‌ 1న ఎల్బీ నగర్‌‌,మహేశ్వరంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. 2నసిరిసిల్ల రూరల్‌‌ మండలం, ఉప్పల్‌‌, మల్కాజిరిగి-లో రోడ్ షోల్లో పాల్గొంటారు. 3న హుజూర్‌‌నగర్‌‌ బహిరంగ సభలో, కంటోన్మెంట్‌ , మేడ్చల్‌‌ రోడ్షోల్లో పాల్గొని ప్రచారం చేస్తారు. 4న ఇబ్రహీం-పట్నం లో బహిరంగ సభ, అంబర్‌‌పేట, ముషీరా-బాద్‌‌లో రోడ్ షోల్లో పాల్గ ొంటారు. 5న కోదాడలోసభ, సికింద్రాబాద్‌‌, సనత్ నగర్‌‌లో రోడ్ షోలునిర్వహిస్తారు. 6న జూబ్లీహి ల్స్‌ , ఖైరతాబాద్‌‌,నాంపల్లిలో రోడ్ షోలో పాల్గ ొంటారు. 7న మహ-బూబ్‌‌నగర్, జడ్చర్ల, షాద్‌‌నగర్‌‌ బహిరంగ సభల్లోపాల్గ ొంటారు. రాజేంద్రనగర్‌‌, శేరిల ింగంపల్లిలోరోడ్ షోలు నిర్వహిస్తారు. 8న ఇల్లెం దు, పినపాకబహిరంగ సభల్లో , కూకట్‌ పల్లి, కుత్బుల్లా పూర్‌‌ రోడ్ షోల్లో పాల్గ ొంటారు. 9న నల్గ ొండ పట్టణం-లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తారు.

Latest Updates