బీజేపి తీర్థం పుచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

దమ్మాయిగూడ: దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పథకాలపై ఆకర్షితులై మంగళవారం బీజేపిలోకి చేరారు. బీజేపి ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి వారిని కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంద‌న్‌ప‌ల్లి గ్రామ‌ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బింగి రమేష్ గౌడ్ ను దమ్మాయిగూడ బీజేపి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉపాధ్యక్షులు కొంపల్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన ప్రజలందరూ ఆందోళన చెందుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సెక్రెటరియేట్ నూతన భవనాన్ని నిర్మించడం వారి నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డ్ మెంబర్ పట్లోళ్ళ విక్రంరెడ్డి, దమ్మాయిగూడ బీజేపి ప్రెసిడెంట్ మోర నాగమల్లారెడ్డి, కీసర మండల భాజాపా ఉపాధ్యక్షులు వంగేటి బాపిరెడ్డి, బీజేవైఎం నాయకులు టి. విక్రమ్ సింగ్, 6వ వార్డ్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, శ్రీరాములు, యువజన నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates