గెట్‌వెల్‌ సూన్‌ అమిత్‌ షా: పలువరు లీడర్లు ట్వీట్లు

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌‌ ద్వారా తెలియజేశారు. కాగా.. ఆయన త్వరగా కోలుకోవాలని పలువరు నేతలు ట్వీట్లు చేశారు. అమిత్‌షా త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు నేతలు ట్వీట్లు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అస్సాం మినిస్టర్‌‌ బిశ్వ శర్మ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, అభిషేక్‌ సింఘ్వీ, ఎంపీ తేజ్వీ సూర్య, లడాక్‌ ఎంపీ తదితరలు ట్వీట్‌ చేశారు. “ అమిత్‌ షా జీ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. “ అమిత్‌ షా జీ కి కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను” అని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకున్నానని, పాజిటివ్‌ వచ్చిందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

Latest Updates