సిబ్బంది కోసం రూ. 750 కోట్లు కేటాయించిన వార్నర్ మీడియా

తమ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసే సిబ్బంది కోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ మీడియా 100 మిలియన్ డాలర్లు కేటాయించింది. హాలీవుడ్‌ సినిమాలకు సంబంధించి వార్నర్ మీడియా గురించి చెప్పక్కర్లేదు. కొన్ని వందల సినిమాలను ఈ సంస్థ నిర్మించింది. ఈ సంస్థలో దాదాపు 30 వేల మంది పనిచేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని అత్యవసర సర్వీసులు తప్ప మిగతావన్నీ స్తంభించిపోయాయి. దాంతో చాలామంది పనులు లేకపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా సంస్థలు తమ సిబ్బంది కోసం ఎంతో కొంత ఆర్ధికసాయం ప్రకటించాయి. ఆ దిశగానే వార్నర్ మీడియా కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, నటులు, సిబ్బంది కోసం 100 మిలయన్ డాలర్లు (భారత కరెన్సీలో అక్షరాల రూ. 7,48,76,00,000.00 ) అంటే దాదాపు రూ. 750 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జాన్ స్టాంకీ తెలిపారు.

వార్నర్ మీడియా.. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ మరియు హెచ్‌బీఓ చానెళ్లను నిర్వహిస్తుంది. వచ్చే మే నెలలో HBO మాక్స్ అప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు వార్నర్ మీడియా సీఈఓ జాన్ స్టాంకీ తెలిపారు.

తమ సంస్థ యొక్క టెక్నికల్ టీం చాలా ప్రత్యేకమైన పరిస్థితులలో పనిచేస్తూ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ కోసం తీవ్రంగా పనిచేస్తున్నాయి. అందువల్ల తమ HBO మాక్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ మే నెలలో ప్రారంభించడానకి షెడ్యూల్‌ చేస్తున్నామని జాన్ స్టాంకీ తెలిపారు.

For More News..

లక్ష కేసులు దాటిన అగ్రరాజ్యం

మాస్కు లేకుంటే 300.. గుంపుగా ఉంటే 500 ఫైన్

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి

Latest Updates