కరోనా కాటేస్తది: లాక్ డౌన్ ఎత్తివేస్తే భారత్ ను ఆపడం ఎవరి తరం కాదు

లాక్ డౌన్ విషయంలో భారత్ తొందరపడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రముఖ హెల్త్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ హెచ్చరించారు.  దేశ వ్యాప్తంగా మే 3వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మే3 తరువాత లాక్ డౌన్ ను విడతల వారీగా ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ లాక్ డౌన్ పై రిచర్డ్ స్పందించారు. లాక్ డౌన్ విషయంలో భారత్ తొందరపడకూడదని, ఒకవేళ తొందరపడితే రెండో విడత కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ చేసిన కృషి పై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన..10వారాల పాటు చాలా పకడ్బందీగా లాక్ డౌన్ ను కొనసాగిస్తే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందన్నారు. లాక్ డౌన్ తో తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుందని అంగీకరించారు. అలా అని లాక్ డౌన్ ను ఎత్తివేస్తే ప్రమాదమన్నారు.

10వారాల పాటు ఎందుకు లాక్ డౌన్ కొనసాగించాలి

10వారాల పాటు లాక్ డౌన్ ను కొనసాగించాలని, లేదంటే రెండో సారి కరోనా సోకితే దేశానికే ప్రమాదమని రిచర్డ్ తెలిపారు.  చైనా వుహాన్ లో ప్రారంభమైన కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ఆదేశలో జనవరి 23నుంచి ఏప్రిల్ నెల ప్రారంభం వరకు 10వారాల పాటు లాక్ డౌన్ ను అమలు చేశారని, దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిందని, సాధారణ స్థితికి వచ్చిందన్నారు.

10 వారాల తరువాత కరోనా సోకదని గ్యారెంటీ ఏంటీ ?

10వారాల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తే ఆ తరువాత కరోనా సోకదా అన్న ప్రశ్నకు స్పందించిన రిచర్డ్..లాక్ డౌన్ వల్ల కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుతుందని, చాలా తక్కువ స్థాయిలో కరోనా సోకుతుందన్నారు. లాక్ డౌన్ మే3న ఎత్తివేస్తే కష్టమేనన్నారు. 10వారాల తరువాత సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, కరోనా టెస్ట్ లు, కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయాలని రిచర్డ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Latest Updates