స్టూడెంట్ లీవ్ లెటర్ : నేను చచ్చిపోయా.. సెలవివ్వండి

ఉత్తర్‌ ప్రదేశ్‌ : ‘బాస్‌ .. మా బామ్మ చనిపోయింది. నాకు అర్జెంట్‌ గా లీవ్‌ కావాలి’.. ఓ ఉద్యోగి అర్జీ..‘సార్‌ .. మా తాత చచ్చిపోయాడు సార్‌. ఊరెళ్లాలి. సెలవివ్వండి’.. ఓ స్టూడెంట్‌ లీవ్‌ లెటర్‌ .. ఇది కామన్‌. కొత్త కారణం చెప్పండయ్యా. పాతవే చెప్పి చెప్పి లీవ్‌లు అడగకండయ్యా.. ఇదీ వచ్చే ఆన్సర్‌. బహుశా అందుకేనేమో ఆ స్టూడెంట్‌ ఈ ప్లాన్‌ వేశాడు. ఏకంగా ‘నేనే పోయాను. నాకు ఒక పూట లీవ్‌ కావాలి’ అంటూ లీవ్‌ లెటర్‌ రాశాడు. తానే చచ్చిపోయానని లీవ్‌ లెటర్‌ రాసి అతడు షాకిస్తే.. దాన్ని ఆమోదించి ఇంకా పెద్ద షాకిచ్చాడు అతడి ప్రిన్సిపాల్‌. ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో జరిగిందీ ఘటన.

ఎనిమిదో క్లాస్‌ స్టూడెంట్‌ .. ఒక్క పూట సెలవు కోసం తనను తానే ‘చంపేసుకున్నాడు’ మరి. ఆగస్టు 20న జరిగిన ఈ ఘటన గురించి.. ఆ పిల్లాడు ఫ్రెండ్స్‌‌కు చెప్పడంతో బయటకు పొక్కింది. సరైన కారణంతోనే పిల్లలు తన వద్దకు లీవ్‌ లెటర్‌ తీసుకొస్తారన్న నమ్మకంతోనే ప్రిన్సిపాల్‌ సంతకం చేస్తారని ఆ స్కూల్‌ టీచర్లు చెబుతున్నారు.

Latest Updates