రాజకీయాల నుంచి విద్యను దూరంగా ఉంచాలి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా స్టూడెంట్స్‌పై ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతో సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి నేషనలలిజం, లోకల్ గవర్నమెంట్, ఫెడరలిజం లాంటి టాపిక్స్‌ను తొలగించింది. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హెచ్‌ఆర్‌‌డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. కొందరు సెన్సేషనలిజం కోసమే ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి పలు టాపిక్స్‌ను తొలగించడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. ఆ టాపిక్స్‌నే లక్ష్యంగా చేసుకుంటూ వాళ్లు కావాలనే దీన్ని సెన్సేషనలైజ్ చేయాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. రాజకీయాల నుంచి విద్యను దూరంగా ఉంచాలని పోఖ్రియాల్ కోరారు.

Latest Updates