మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు ముట్టడికి యత్నం

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి వామపక్షాలు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. దీంతో అక్కడే బైఠాయించిన వామపక్ష నేతలు సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కార్ వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు నేతలు.