కాంగ్రెస్ ను వీడి చరిత్రాత్మక తప్పిదం చేశా: డీఎస్

కాంగ్రెస్ ను వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు  TRS రాజ్యసభ్యుడు డి.శ్రీనివాస్. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… దిగ్విజయ్ సింగ్ తనపై సోనియా గాంధీకి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కారణంగానే మనస్తాపంతో ఆ పార్టీని వీడినట్లు చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు డీఎస్. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానం పై సంతకాలు పెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ.. సపోర్ట్ చేసింది బీజేపీ  అన్నారు.

మరోవైపు మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీఎస్. తల తిక్క మాటలు మానుకోవాలన్నారు. ఆయన తనపై చేసిన విమర్శలను ఖండిస్తున్నానన్నారు. తండ్రి, కొడుకు, కూతురు బాగు పడితే బంగారు తెలంగాణ అయినట్లా అని ప్రశ్నించారు.

అంతేకాదు మెడికల్ కాలేజీ కోసం తన ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని డీఎస్ ప్రకటించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో  నిజామాబాద్ ప్రజలు మంచి వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Latest Updates