ఎన్నారై పెళ్లిళ్లలో తొందరపడి మోసపోవద్దు

ఎన్నారై పెళ్లిళ్లలో తొందరపడి మోసపోవద్దు

విదేశాల్లో ఉండే వారిని పెళ్లి చేసుకునే ముందు.. వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు జాతీయ మహిళా కమిషన్ (NCW ) చైర్‌‌పర్సన్ రేఖా శర్మ.  NCW ఆధ్వర్యంలో బేగేంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన NRI మ్యారేజేస్ లీగల్ అవేర్‌‌నెస్ సెమినార్‌‌కు రేఖాశర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టేట్ విమెన్ సేఫ్టీ వింగ్ సహకారంతో జరిగిన ఈ సెమినార్ లో మహిళలపై దాడులు, మహిళా సమస్యలపై చర్చించారు. విదేశాల్లో స్థిరపడిన వాళ్లను పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు కానీ.. తొందరపడి మోసపోవద్దని రేఖాశర్మ సూచించారు.

 

అన్ని మతాల్లో అమ్మాయిల పెండ్లి వయసు ఒకేలా ఉండాలె

ప్రస్తుతం చట్టప్రకారం 18 ఏండ్లుగా ఉన్న ఆడ పిల్లల పెండ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలకు మేలు జరుగుతుందని రేఖా శర్మ అన్నారు. అయితే ఇది మతానికో రకంగా ఉండకూడదని, అన్ని మతాల్లోనూ ఆడపిల్లల కనీస పెండ్లి వయసు 21 వర్తించేలా చేయాలని ఆమె కోరారు. ‘‘ముస్లిం అమ్మాయిలకు మంచి విద్య ఎందుకు అందకూడదు? చిన్న వయసులో పెండ్లి చేయడం ద్వారా వాళ్ల ఆరోగ్యం విషయంలో ఎందుకు రాజీ పడాలి?” అని ఆమె నిలదీశారు. మహిళా సంక్షేమం విషయంలో చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉండాలని రేఖా శర్మ అన్నారు.