భారత దిగ్గజ అథ్లెట్ 91 ఏళ్ల మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఇంట్లో పని చేసే సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అతను పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మిల్కా పరిస్థితి నిలకడగానే ఉందని అతని భార్య నిర్మల్ కౌర్ తెలిపారు.
తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, బుధవారం జాగింగ్ నుంచి తిరిగి వచ్చాక కాస్త అలసటగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నానని.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
అథ్లెట్‌గా ఎంతో ఖ్యాతి గడించిన మిల్కా సింగ్..కెరీర్లో ఎన్నో మరపురాని మారథాన్లలో పాల్గొన్నారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల రేస్ చాలా ప్రత్యేకం. ఈ పోటీల్లో అతను నాలుగో స్థానంలో నిలిచినా.. ట్రాక్‌పై అతను చూపిన ప్రతిభతో భారతీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ రేస్ ద్వారా ఒలింపిక్స్ లో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అలాగే ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక అథ్లెట్ కూడా మిల్కా సింగే.

