ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నక్రికెట్ లెజెండ్స్

మ్యాచ్‌‌ లంచ్‌‌ బ్రేక్‌‌లో సచిన్‌‌, కుంబ్లే, హర్భజన్‌‌ సింగ్‌‌, వీవీఎస్ లక్ష్మణ్‌‌ 1993లో వెస్టిండీస్‌‌తో హీరో కప్‌‌ ఫైనల్‌‌, 2001లో ఆస్ట్రేలియాతో టెస్ట్‌‌ సిరీస్‌‌ నాటి ఐకానిక్ మూమెంట్స్‌‌ను నెమరువేసుకున్నారు. మనం ఆడుతున్నప్పటి రోజుల నుంచి ఇలా కూర్చొని ముచ్చటించుకునే అవకాశం రాలేదని కుంబ్లే అనగా.. భజ్జీ హ్యాట్రిక్‌‌తో ఆ మ్యాచ్‌‌ (2001)స్వరూపమే మారిపోయిందని, ద్రవిడ్‌‌–లక్ష్మణ్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌ అద్భుతం సృష్టించడంతోపాటు తమ కాన్ఫిడెన్స్‌‌ను పెంచిందని సచిన్‌‌ తెలిపాడు. ఈడెన్‌‌లోని ప్రస్తుత పరిస్థితులు తనని 15 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తున్నాయని హర్భజన్‌‌ అన్నాడు.  ఒకవేళ తాను100 మంది సారథ్యంలో ఆడినా..  దాదానే ఎప్పటికీ తన కెప్టెన్‌‌ అని భజ్జీ  స్పష్టం చేశాడు.ఈ  నలుగురు లెజెండ్స్‌‌ ఈ అవకాశాన్ని  కల్పించిన తమ కెప్టెన్‌‌ దాదాకు  కృతజ్ఞతలు తెలిపారు. అడ్మినిస్టేషన్‌‌ పనుల వల్ల ఈ ప్రోగ్రామ్​లో దాదా  పాల్గొనలేకపోయాడు.

Latest Updates