పతంజలి చేతికి రుచి సోయా

Lenders approve Patanjali's Rs 4,325 cr bid for Ruchi Soya

రూ.4,325 కోట్ల బిడ్ ఖరారు

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన రుచి సోయా ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ను పతంజలి ఆయుర్వేద స్వాధీనం చేసుకోనుంది. రుచి సోయాను చేజిక్కించుకునేందుకు రూ. 4,325 కోట్ల బిడ్‌‌‌‌‌‌‌‌ను పతంజలి ఆయుర్వేద దాఖలు చేసింది. రుచి సోయా రూ. 9,300 కోట్ల అప్పులు చెల్లించకపోవడంతో రుణదాతలు నేషనల్‌‌‌‌‌‌‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. దాంతో రుచి సోయా ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ అప్పచెప్పేందుకు బిడ్‌‌‌‌‌‌‌‌లను పిలిచారు.

ఈ కంపెనీ కోసం అదాని విల్మార్‌‌‌‌‌‌‌‌, పతంజలి ఆయుర్వేద పోటీపడ్డాయి. నిజానికి అదాని విల్మార్‌‌‌‌‌‌‌‌ అత్యధిక బిడ్డర్‌‌‌‌‌‌‌‌గా ఎంపికైనా , ఏవో కారణాల వల్ల వెనక్కు తగ్గింది. ఫలితంగా రివైజ్డ్‌‌‌‌‌‌‌‌ బిడ్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసే అవకాశం పతంజలి ఆయుర్వేదకు ఇచ్చారు. అప్పుడు పతంజలి తన బిడ్‌‌‌‌‌‌‌‌ను సవరించి రూ. 4,325 కోట్లకు తాజా బిడ్‌‌‌‌‌‌‌‌ను దాఖలు చేసింది. పతంజలి ప్రతిపాదనకు అనుకూలంగా రుణదాతలలో 96 శాతం మంది ఓటు వేశారు. పతంజలి కూడా ఈ సమాచారం సరయినదేనని అధికారికంగా చెప్పింది. ఓటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం మాకు అనుకూలంగా వచ్చిందనే విషయం తెలిసిందని పతంజలి ఆయుర్వేద్‌‌‌‌‌‌‌‌ అధికార ప్రతినిధి ఎస్‌‌‌‌‌‌‌‌ కే టిజరావాలా తెలిపారు. బహుశా గురువారం మాకు రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా తెలియచేస్తారని చెప్పారు.

రుచి సోయా స్వాధీనంతో సోయాబీన్‌‌‌‌‌‌‌‌ ఆయిల్స్‌‌‌‌‌‌‌‌, సంబంధిత ఉత్పత్తులలో పెద్ద ప్లేయర్లలో ఒకటిగా పతంజలి అవుతుంది. 2017 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌టీ రుచి సోయా ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ దివాలా ప్రక్రియకు అనుమతించింది. అంతకు ముందు, రుణదాతలైన స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ ఛార్టర్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, డీబీఎస్‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు ఇన్‌‌‌‌‌‌‌‌సాల్వెన్సీ ప్రక్రియకు అనుమతించాలని పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశాయి. అదాని విల్మార్‌‌‌‌‌‌‌‌ తప్పుకోవడంతో, రెండవ బిడ్డరైన పతంజలి తన పాత బిడ్‌‌‌‌‌‌‌‌కు మరో రూ. 200 కోట్లను చేర్చి రూ. 4,350 కోట్లకు కొత్త బిడ్‌‌‌‌‌‌‌‌ వేసింది. ఇదికాకుండా, రుచి సోయా కంపెనీ పునరుద్ధరణకు ఇంకో రూ. 1,700 కోట్లను పతంజలి ఆయుర్వేద వెచ్చించనుంది. బ్యాంకులకు, ఇతర రుణదాతలకు రుచి సోయా బకాయిపడిన మొత్తం రూ. 9,345 కోట్లు. స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా రూ. 1800 కోట్లు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రూ. 816 కోట్లు, పంజాబ్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రూ. 743 కోట్లు, స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ ఛార్టర్డ్‌‌‌‌‌‌‌‌ బ్యాంకు రూ. 608 కోట్లు రుణంగా రుచి సోయాకు ఇచ్చాయి.

రుచి సోయాకు దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారీ యూనిట్లు ఉన్నాయి. న్యూట్రెలా, మహాకోష్‌‌‌‌‌‌‌‌, సన్‌‌‌‌‌‌‌‌రిచ్‌‌‌‌‌‌‌‌, రుచి స్టార్‌‌‌‌‌‌‌‌, రుచి గోల్డ్‌‌‌‌‌‌‌‌ వంటి ప్రముఖ బ్రాండ్లన్నీ రుచి సోయా సొంతమే. గత కొన్నేళ్లలో అద్భుతమైన వృద్ధి సాధించిన పతంజలి ఆయుర్వేద 2017–18లో జీఎస్‌‌‌‌‌‌‌‌టీ అమలుతో రూ. 12 వేల కోట్ల అమ్మకాలకే పరిమితమైంది. అంతకు ముందు 2016–17లో 111 శాతం వృద్ధితో రూ. 10,561 కోట్ల అమ్మకాలను పతంజలి సాధించడం విశేషం. ఇప్పుడు వ్యూహాత్మకంగా పతంజలి వ్యవసాయం, ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్ రంగాల మీద ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెడుతోంది.

Latest Updates