స్కూళ్లలో పిల్లలను టెర్రరిస్టులుగా మార్చే కుట్ర

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌లోని పలు స్కూళ్లపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. పుల్వామాతోపాటు షోపియాన్‌‌లోని కొన్ని ఎడ్యుకేషన్ సెంటర్స్‌‌లో పిల్లలను టెర్రరిజంకు అనుకూలంగా పని చేసేలా ప్రోత్సహిస్తున్నారని సమాచారం. మతపరమైన విద్యను బోధించే జమాత్ ఏ ఇస్లామీ, సిరాజ్ ఉల్ ఉలూమ్‌‌ సంస్థలతో అనుబంధంగా పని చేస్తున్న కొన్ని స్కూల్స్‌‌‌లో టెర్రరిజం కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించేలా బోధిస్తున్నారని సమాచారం. దీంతో ఇలాంటి స్కూళ్లు, ఎడ్యుకేషన్ సెంటర్స్‌‌పై సెక్యూరిటీ ఏజెన్సీలు ప్రత్యేక నిఘా పెంచనున్నాయి. ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ స్పందించారు.

‘షోపియాన్, పుల్వామా బెల్ట్‌‌లోని చాలా స్కూళ్లు దియోబంది సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందాయి. అలాగే జమాత్ ఏ ఇస్లామీ (జేఈఎల్)కు అనుబంధంగా పని చేస్తున్నాయి. జేఈఎల్‌‌ను ఉపా చట్ట కింద గతేడాది చట్ట విరుద్ధమైన సంస్థగా ప్రభుత్వం నిషేధించింది. అయినా లోయలోని కొన్ని స్కూళ్లు జేఈఎల్ ఐడియాలజీని బోధిస్తున్నాయి. అలాగే బోధనా ప్రాంతాలను స్థానిక పిల్లల్లో ర్యాడికలైజేషన్‌‌ను పెంపొందించడానికి వాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి యత్నిస్తున్నాయి’ అని దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు.

Latest Updates