అమెజాన్‌ అడవులకు టైటానిక్’ హీరో రూ.36 కోట్ల విరాళం

అమెజాన్‌ అడవులు మనుషులు ఎంత ఉపయోగకరమైనవి. భూమి మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు అవే ఆధారం.  అయితే గత కొన్నిరోజులుగా అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. కార్చిచ్చు బారినపడి వేలాది ఎకరాలు దగ్ధం కావడంతో పాటు వన్యప్రాణులు చనిపోయాయి. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు.

అమెజాన్‌ అడవుల కోసం ప్రముఖ హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియో విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. ఇప్పటికే ఆయన అనేక సంస్థలతో కలసి పర్యావరణం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ దుస్థితి పట్ల చలించిపోయిన డికాప్రియో తనవంతుగా రూ.36 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తన అభిమానులు కూడా స్పందించి విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవలే ‘ఎర్త్ అలయన్స్’ అనే ఛారిటీ సంస్థను స్థాపించిన డికాప్రియో తన సంస్థ తరఫున విరాళం ప్రకటించారు.

Latest Updates