ఇక్రిశాట్ లో చిరుతపులి పట్టివేత

leopard-caught-in-icrisat-patancheru

హైదరాబాద్: గత కొన్ని నెలలుగా పటాన్‌చెరు  ఇక్రిశాట్ లో సంచరిస్తున్న చిరుతను అటవీ శాఖ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి మత్తు మందు ఇచ్చి చిరుతను పట్టుకున్న సిబ్బంది.. అనంతరం నగరంలోని నెహ్రూ జూ పార్కుకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేయనున్నారు. ఈ ఏడాది  ఫిబ్రవరి లో చిరుత ఇక్రిశాట్ పరిసర ప్రాంతాల్లో కనిపించింది. ప్రస్తుతం సిబ్బంది చిరుతను పట్టుకోవడంతో అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Latest Updates