అమ్మాయి తల వాసన చూసి వదిలేసిన చిరుత.. వైరలవుతున్న వీడియో

చిరుతపులి ఆమడ దూరంలో ఉందంటేనే హడలెత్తిపోతాం. అలాంటిది ఆ చిరుతే మన దగ్గరకొచ్చి తలపై తలపెట్టి వాసన చూస్తే ఎట్లుంటది? ఇదిగో ఈ అమ్మాయిది అదే పరిస్థితి. టాంజానియాలోని సఫారీకి వెళ్లిన ఆ యువతి ఓపెన్​టాప్​ కారుపైకి చిరుత ఎక్కింది. ఆమె తలను తన తలతో నిమిరింది. వెంట్రుకలను వాసన చూసింది. ఆమె అటూ ఇటూ కదలకుండా ఆ మొత్తం తతంగాన్ని వీడియో తీసింది. కాసేపయ్యాక ఆ చిరుతే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆఫ్రికా ట్రావెల్​ ఇన్​స్టాగ్రామ్​లో ఆ వీడియోను పెట్టడంతో వైరల్​ అయింది. సఫారీకి వెళ్లాలనుకునేవాళ్లూ జర జాగ్రత్త అంటూ సూచనలు చేసింది.

Latest Updates