బీజేపీ కార్యకర్తల్ని చంపింది ఎల్ఈటీ ఉగ్రవాదులే

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది.  వైకే పోరాలో కుల్గాం జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి ఫిదా హుస్సెన్ యాటూ, ఉమర్ రషీద్ బేగ్, ఉమర్ రంజాన్ హజాంగా కారులో వెళుతున్న బీజేపీ కార్యకర్తల్ని హత్య చేసింది లష్కరేతోయిబా ఉగ్రవాదులేనని పోలీసులు నిర్ధారించారు.

కాశ్మీర్ రేంజ్ ఐజీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వైకే పోరాలో గురువారం రాత్రి 8.20 నిమిషాలకు ముగ్గురు కార్యకర్తలు కారులో వెళుతుండగా పాకిస్థాన్ కు చెందిన ఎల్ ఈటీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అన్నారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా..అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు చెప్పారని  ఐసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కాల్పులకు ముందు ఎల్ ఈటీ ఉగ్రవాదులు ఇంగ్లీష్, హిందీలో శ్మశాన వాటికలు నిండుతాయని అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్ లు షేర్ చేశారని పీటీఐ తెలిపింది.

Latest Updates