చౌకీదార్ కావాలంటే నేపాల్ నుంచి తెచ్చుకుంటా: హార్దిక్

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతలు చేపట్టిన మై బీ చౌకీదార్‌ ఉద్యమంపై…కాంగ్రెస్ నాయకుడు, పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ హాట్ కామెంట్స్ చేశారు.  దేశాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రధాన మంత్రి మాత్రమే ఉండాలని కోరుకుంటానే తప్ప చౌకీదార్లను కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో హార్దిక్‌ పటేల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చౌకీదార్‌ అవసరం ఉంటే…తాను నేపాల్‌కు వెళ్తాన్నారు హార్దిక్. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే, యువతకు విద్య, ఉపాధి కల్పించి దేశాన్ని దృఢంగా మార్చే ప్రధాని ఉండాలని కోరుకుంటానన్నారు. ప్రస్తుతం కావాల్సింది దేశానికి ప్రధాని మాత్రమేనన్నారు హార్దిక్.

 

Latest Updates