కూర‌గాయ‌లు త‌ర‌లించేందుకు పాసులు

సిద్దిపేట జిల్లాలో ఒక్క కరోన కేస్ కూడా నమోదు కాలేదన్నారు మంత్రి హ‌రీష్ రావు. ఇత‌ర రాష్ట్రల నుండి వచ్చిన వారిని 14రోజులు బయటకు రావోద్దని అధికారులకు చెప్పామ‌న్నారు. సిద్దిపేట జిల్లాలో కంట్రోల్ రూంను ప్రారంభించామ‌న్న మంత్రి.. ఇది 24 గంటలు కోనసాగుతుందన్నారు. కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ 9849903256 ప్రజలకు ఏ అవసరం ఉన్న సాయంత్రం 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో 7వేల ఎకరాలలో కూరగాయలను పండించేవారు ఉన్నారని.. వీరి కూరగాయలను హైదరాబాద్ తీసుకెళ్లే వారికి పాస్ లు ఇస్తామ‌న్నారు. లాక్ డౌన్ తో జిల్లా రైతులకు ఎట్టి పరిస్ధితిలో ఇబ్బంది కలగ‌నివ్వ‌మ‌ని చెప్పారు.

జిల్లాలో 3 టెలికాన్ఫిరెన్స్ ను ఏర్పాటు చేశామ‌ని.. ప్రభుత్వం ఎన్ని చేసినా.. ప్రజలందరు స్వీయ నియంత్రణలో ఉండాలన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే అందరూ నిబద్దతతో ఉండాలని తెలిపారు. ప్రజలు నిత్య అవసర వస్తువుల కోసం ప్రతిరోజు బయటకు రావోద్దన్నారు. ఒక్కరోజు వస్తే వారం రోజుల సరకులు తీసుకెళ్లాలన్న మంత్రి హ‌రీష్జి జిల్లాలో రైతులకు, డాక్టర్ లకు, మీడియా వారికి పాస్ లు ఇస్తున్నామ‌న్నారు.

జిల్లాలో వైద్యసిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది వారి ప్రాణాలను లెక్కచేయకుండా పని చేస్తున్నారని.. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పారు. కరోనాను ఆషామాషీగ తీసుకోరాదని.. అగ్రరాజ్యం అయిన అమెరికానే గజ గజలాడుతుందన్నారు. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకుండా, సిగ్గుపడకుండా డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు మంత్రి హ‌రీష్ రావు.

Latest Updates