నెక్స్ట్ బర్త్ డేని సీఎం ఆఫీసులో జరుపుకుందాం

తమిళనాడులోని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమలహాసన్ ఇటీవల పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తదుపరి పుట్టినరోజును తమిళనాడు సీఎం కార్యాలయంలో జరుపుకుందామని ట్వీట్ చేశారు.

బర్త్ డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు వారందరి శుభాకాంక్షలు తన పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చాయని తెలిపారు. తన బర్త్ డే రోజున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తమ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. వారి కష్టానికి, ప్రేమకు తగ్గ ఫలితం దక్కేందుకు తాను తమిళనాడు రాజకీయాల్లో కష్టపడతానని చెప్పారు. ఈ క్రమంలోనే తన తదుపరి పుట్టినరోజును సీఎం కార్యాలయంలో జరుపుకుందామని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కమల్.

Latest Updates