మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

రూపాయి ఖర్చు లేకుండా సత్యవతి రాథోడ్ కి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం హమీ ఇచ్చారన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లును మనము గెలించుకుంటే ఢిల్లీలో మన సీఎం కేసీఆర్ ప్రధాని మంత్రి అవుతారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ MP అభ్యర్థి గా పోటీ చేస్తున్న మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఏప్రిల్ 4న మహబూబాబాద్ లో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు మాజీ డిప్యూటీ  సీఎం కడియం శ్రీహరి.17 సీట్లు గెలుచుకుంటే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి వుందన్నారు.  మాలోతు కవిత ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు కడియం.

Latest Updates