రికార్డు టైటిల్ పై హామిల్టన్‌ గురి

రష్యన్‌‌ గ్రాండ్‌ ప్రిలో లూయిస్‌‌కు పోల్‌‌ పొజిషన్‌

సోచి: ఫార్ములా వన్‌ లో అత్యధిక టైటిళ్ల  రికార్డును సమం చేసేందుకు మెర్సిడెస్‌‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌‌ హామిల్టన్‌ అడుగు దూరంలో నిలిచాడు. సీజన్‌ లో జోరు మీదున్న బ్రిటన్‌ డ్రైవర్‌ రష్యన్‌ గ్రాండ్‌ ప్రిలో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం ఉత్కంఠగా సాగిన క్వాలిఫయింగ్‌‌ రేసులో ట్రాక్‌ రికార్డు టైమ్‌‌ 1 నిమిషం 31.304 సెకండ్లతో ఫాస్టెస్ట్‌ ల్యాప్‌ పూర్తి చేశాడు. రెడ్‌ బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌ స్టాపెన్‌ ను 0.563 సెకండ్స్‌ తేడాతో ఓడించి వరుసగా ఐదోసారి పోల్‌ దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సెబాస్టియన్‌ వెటెల్‌ (ఫెరారీ) కారు క్రాష్‌ అయింది. ఆ టైమ్‌‌లో ఎలిమినేషన్‌ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న హామిల్టన్‌ ఆదివారం జరిగే ఫైనల్లో నెగ్గితే లెజెండరీ డ్రైవర్‌ మైకేల్‌ షుమాకర్‌ 91 టైటిళ్ల వరల్డ్‌‌ రికార్డును సమం చేయనున్నాడు.

 

Latest Updates