కిరాణం, హోటల్స్ లో పని చేస్తున్న బాలకార్మికులకు విముక్తి

రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ శివారులోని కిరాణం, హోటల్స్ లో పనిచేస్తున్న బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు పోలీసులు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్ర కిరాణం షాప్, బాలాజీ టిఫిన్ సెంటర్, బాలాజీ పురుషోత్తం కిరణా షాపు, పాత టైర్ల రీసైక్లింగ్ షాప్స్ లో కొంత మంది చిన్నారులు పని చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు..మంగళవారం బాల కార్మికులను గుర్తించామన్నారు.

చిన్నారులతో పనిచేయిస్తున్న నిర్వాహకులపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చైల్డ్ లేబర్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. రాష్ట్రాల నుండి కానీ.. ఇతర జిల్లాల నుండి షాపుల్లో చిన్నారులతో పని చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని.. చిన్నపిల్లలను ఎవ్వరూ పనుల్లో పెట్టుకోవద్దని తెలిపారు చైల్డ్ లేబర్ అధికారి దేవేందర్ చారి.  చిన్నారులను చైల్డ్ హోమ్ కు పంపించామని చెప్పారు దేవేందర్ చారి.

Latest Updates