ఎల్‌ఐసీ సరికొత్త రికార్డ్‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్‌‌ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ ఐసీ) పాలసీలను అమ్మడంలో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. గతేడాది మార్చి 31 నాటికి 2,14,03,905 పాలసీలను విక్రయించగా, ఈ నెల 17 నాటికి 2,14,22,370
పాలసీలను అమ్మి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ నెల చివరినాటికల్లా ఈ నెం బర్‌ 2.5 కోట్లను దాటుతుందని LIC ధీమా వ్యక్తం చేసింది. కంపెనీ ఇండివిడ్యువల్‌ న్యూ బిజినెస్‌ మంచి వృద్ధిని సాధించిందని పేర్కొంది. ఈ వృద్ధి కంపెనీ మొదటి ఏడాది ప్రీమియం ఇన్‌ కమ్‌ లో 12.85 శాతంగా, పాలసీ నెం బర్లలో 21.84 శాతంగా ఉందని తెలిపింది.

Latest Updates