ప్రతిభగల విద్యార్థులకు ఎల్ఐసీ అందిస్తున్న ఆర్థిక సాయం

ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌ షిప్ స్కీం 2019 పేరుతో ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, గ్రాడ్యుయేషన్, డిప్లామా, ఐటీఐ వంటి ఉన్నత విద్యనభ్యసించేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తారు. ఆన్‌‌లైన్‌‌లో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ స్కాలర్‌‌షిప్ కి 2018-19 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్/ 10+2లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరి ఉండాలి.

టెన్త్ తర్వాత ఒకేషనల్, ఐటీఐ కోర్సులు చేయాలనుకుంటున్న వారికే ఈ స్కాలర్‌‌షిప్ లభిస్తుంది. కుటుంబ ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే స్కాలర్‌‌షిప్ పొందొచ్చు. టెన్త్ పాసై 10+2 ప్యాటర్న్‌‌లో ఉన్నత చదువులు చదవాలనుకునే బాలికలకు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ పేరుతో ఆర్థికసాయం చేస్తారు.

ఆర్థిక సాయం ఇలా

రెగ్యులర్ స్కాలర్స్ కి సంవత్సరానికి రూ.20 వేలు 4 ఇన్‌‌స్టాల్‌‌మెంట్లలో అందజేస్తారు. బాలికలకు రూ.10 వేల స్కాలర్‌‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. రెగ్యులర్ స్కాలర్స్ కి కోర్సు పూర్తయ్యే వరకు ఈ సాయం అందుతుండగా బాలికలకు రెండేళ్లపాటు మాత్రమే ఉపకార వేతనం లభిస్తుంది. టెన్త్, ఇంటర్‌‌ మెరిట్, కుటుంబ ఆదాయం ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. రెన్యువల్ చేయాలంటే ప్రొఫెషనల్ కోర్సుల్లో 55 శాతం, ఆర్స్ట్/ సైన్స్/కామర్స్ వంటి గ్రాడ్యుయే షన్ కోర్సుల్లో 50% శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

చివరితేది: 2019 డిసెం బర్ 24 వెబ్‌ సైట్: www.licindia.in

Latest Updates