చైనా దిగుమతులకు త్వరలో లైసన్సింగ్ విధానం

ఏసీలు, టీవీల విడిభాగాలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

గైడ్ లైన్స్ రెడీ చేస్తున్న వాణిజ్య మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: తాజాగా 59 చైనీస్‌ యాప్‌ లను నిషేధించిన ప్రభుత్వం, చైనా దిగుమతులకు కూడా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏసీలు, టీవీ కాంపోనెంట్లు వంటి ప్రొడక్లట్‌‌ ఇంపోర్స్‌ట్ ను తగ్గించేందుకు ప్లాన్స్‌ రెడీ చేస్తోంది. గుర్తించిన 10–12 ప్రొడక్ట్‌‌లకు లైసెన్స్‌ లను తప్పనిసరి చేయనుంది. దీంతో ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ ఉంటే గాని ఇండియన్‌‌ మార్కెట్లోకి వీటిని దిగుమతి చేయడానికి కుదరదు.

విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి ఈ ప్రొడక్ట్‌‌ల దిగుమతులను తగ్గించేందుకు ఈ చర్యలను తీసుకోనుంది. గతంలో పామ్‌ ఆయిల్‌ , అగర్‌‌బత్తి, టైర్లు వంటి ప్రొడక్ట్‌‌లకు ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ తీసుకోవడం తప్పనిసరి చేశారు. తాజా బార్డర్‌‌‌‌ టెన్షన్లతో ఈ లిస్ట్‌‌లో మరికొన్ని ప్రొడక్ట్‌‌లను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.దేశంలోకి ఏసీలు, వీటి విడిభాగాల దిగుమతులను తగ్గించి, లోకల్‌ గానే వీటి ప్రొడక్షన్‌‌ను మరింత పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సంబంధిత వ్యక్తులు చెప్పారు.

‘దిగుమతులను అనేక రకాలుగా కంట్రోల్‌ చేయొచ్చు. కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం వంటి వాటితో పాటు టెక్నికల్‌ గా కూడా దిగుమతులను తగ్గించుకోవడానికి వీలుంటుంది. ప్రొడక్ట్‌‌లకు లైసెన్స్‌ ను తీసుకోవడాన్ని తప్పనిసరి చేయడం, నిర్దేశిత పోర్టులోకి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం వంటి చర్యలతో దిగుమతులను తగ్గించొచ్చు’ అని పేర్కొన్నారు . లైసెన్సింగ్‌ తీసుకురావడం వలన ఎంచుకున్న దేశాల నుంచి ప్రొడక్ట్‌‌లను దిగుమతులు చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ ప్రొడక్ట్‌‌లకు లైసెన్సింగ్‌ ఈ లిస్ట్‌‌లో ఏసీలతో పాటు స్టీల్‌, అల్యు మినియం, ఫుట్‌ వేర్, బంగాళదుంపలు, ఆరెం జ్‌ లు వంటివి ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు లిథియం ఐయాన్‌‌ బ్యా టరీస్‌, యాంటిబయోటిక్స్‌ , పెట్రోకెమికల్స్, ఆటో, మొబైల్ పార్టులు, టాయ్స్‌ , స్పో ర్ట్స్ గూడ్స్‌, టీవీ సెట్లు, సోలార్‌‌‌‌ ఎక్వి ప్‌ మెంట్లు , ఎలక్ట్రా నిక్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ సర్క్యూట్స్‌ వంటివి కామర్స్‌ మినిస్ట్రీమఈ లిస్ట్‌‌లో యాడ్‌‌ చేయనుందని సంబంధి త వ్యక్తులు చెప్పారు . లైసెన్సింగ్‌ విధానాన్ని తీసుకురావడం పై ఈ మినిస్ట్రీ పనిచేస్తోందని పేర్కొన్నారు.

 

ఇలాంటి చర్యలు ఇండియాకు మేలు చేయవు: చైనా

పాపులర్‌‌‌‌ చైనీస్‌ యాప్స్‌ టిక్‌‌టాక్‌‌, యూసి బ్రౌజర్‌‌‌‌తో సహా 59 చైనీస్‌ యాప్‌ లను ఇండియన్‌‌ గవర్నమెంట్‌ బ్యా న్ చేయడంపై చైనా ప్రభుత్వం స్పందించింది. ఇంటర్నేషనల్​ ఇన్వె స్టర్ల చట్టబద్దమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఇండియన్‌‌ గవర్నమెంట్‌ కు ఉందని పేర్కొంది. చైనీస్‌ యాప్‌ లను బ్యాన్‌‌ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చైనా ఫారిన్‌‌ మినిస్ట్రీ ప్రతినిధి హోలిజియన్‌‌ అన్నారు . ఈ పరిస్థితిని మేము పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్‌ రూల్స్‌, లోకల్‌ చట్టాలు, నియంత్రణలకులోబడి వ్యాపారాలు చేసుకోవాలని చైనీస్‌ బిజినెస్‌ లకు మా ప్రభుత్వం ఎప్పుడూ చెబుతుందని పేర్కొన్నారు . చైనా–ఇండియా మధ్య భాగస్వా మ్యం ఇరు దేశాలకు మేలు చేస్తోందని అన్నారు .ఇటువంటి చర్యలు ఈ భాగస్వామ్యాన్ ని దెబ్బతీస్తాయని, అవి ఇండియాకు మేలు చేయవని పేర్కొన్నారు . యూజర్ల డేటాను విదేశాలకు పంపుతున్నాయని, దేశ రక్షణకు భంగం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం సోమవారం 59 చైనీస్‌ యాప్‌ లను తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. వీటిని నిషేధించాలని ప్రభుత్వం యాప్‌ ఓనర్లకు, యాప్‌ స్టోర్లకు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు, టెలికాం నెట్‌ వర్క్‌‌లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేస్తామని షార్ట్‌‌ వీడియో కంటెంట్‌ యాప్‌ టిక్‌‌టాక్‌‌ పేర్కొంది. తమ 20 కోట్ల యూజర్లకు యాక్సెస్‌ ను నిలిపేశామని తెలిపింది.

Latest Updates