లై డిటెక్టర్ టెస్ట్ కు ఇంద్రాణి వినతి:  తిరస్కరించిన CBI

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా విజ్ణప్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)తోసిపుచ్చింది. ఈ కేసులో తనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని ఇంద్రాణియా ముఖర్జియా సీబీఐను కోరింది. అయితే ఆమె వినతిని CBI తిరస్కరించింది. ఈ కేసు విచారణ ప్రాథమిక దశలో లైడిటెక్టర్ టెస్టుకు తాము కోరినప్పుడు ఆమె ఒప్పుకోలేదని… ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ తో ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది CBI.

Latest Updates