ప్రాణం కంటే ఒలింపిక్స్ ఎక్కువ కాదు : పీవీ సింధు

హైదరాబాద్:  టోక్యో ఒలింపిక్స్ వాయిదా  నిర్ణయాన్ని ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు స్వాగతించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అథ్లెట్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. ప్రాణం కంటే ఏదీ గొప్ప కాదని సింధు చెప్పింది. ‘ఇది మంచి నిర్ణయమే. నిజానికి మనకి ఇంకో దారి కూడా లేదు. ఓ పక్క జనం చనిపోతున్నారు. ప్రాణం కంటే  గొప్పదేదీ కాదు. ఒలింపిక్స్ సహా అన్ని రకాల ఈవెంట్స్ ఆపేస్తూ మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ అధికమవుతోంది. ఒలింపిక్స్ గెలవడం నా కల అని చాలా మంది చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు గేమ్స్ వాయిదా పడ్డాయి. నా వరకు జీవితానికే ప్రాధాన్యం ఎక్కువ’ అని సింధు చెప్పుకొచ్చింది.

Latest Updates