నన్ను కాపాడండి.. సీఎంకు తమిళ డైరెక్టర్ లేఖ

చెన్నై: తమిళ దర్శకుడు ఆర్.శీను రామస్వామి తనకు ప్రాణ హాని ఉందని ట్వీట్ చేశారు. తనను కాపాడాలని కోరుతూ తమిళనాడు సీఎం పళనిస్వామికి శీను లేఖ రాశారు. ‘నా లైఫ్ డేంజర్‌‌లో ఉంది. ముఖ్యమంత్రి గారు నన్ను ఆదుకోండి, అర్జెంట్’ అంటూ శీను ట్వీట్ చేశారు. రోడ్లపై నడవాలన్నా తనకు భయం వేస్తోందని వాపోయారు. కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పారు.

శ్రీలంక వెటరన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌‌‌‌ను తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతితో  సినిమాగా తెరకెక్కించాలని శీను భావించాడు. దీనిపై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విజయ్‌ సేతుపతి ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. సేతుపతిని ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోమని సూచించిన వారిలో రామస్వామి కూడా ఉన్నారు. అలా కోరినందుకు ఇప్పుడు రామస్వామికి బెదిరింపులు రావడం మొదలయ్యాయి. తనకు, విజయ్‌ సేతుపతికి మధ్య చీలిక తీసుకురావడానికి కొందరు యత్నిస్తున్నారని శీను పేర్కొన్నారు.

Latest Updates