పాక్‌ నటీనటులపై జీవితాకాల నిషేధం

ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నది. పుల్వామా దాడి కారణంగా పాకిస్థాన్ నటీనటులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి బాలీవుడ్‌లో పాక్‌కు చెందిన ఆర్టిస్టులెవరూ కనిపించరని చెప్పింది. పాక్ నటీనటులపై పూర్తి నిషేధించాలన్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. ఒకవేళ ఎవరైనా పాక్ నటీనటులను తీసుకుంటే.. వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా తమ వంతు మద్దతు ప్రకటించింది. ఒక రోజు పాటు అన్ని షూటింగ్‌లను నిలిపేసింది. ఈ నిరసనలో పాల్గొన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్.. పుల్వామా దాడి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించారు.

Latest Updates