ఏచూరిపై కేసు ఎత్తేయండి -సీపీఐ నేత సురవరం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ అల్లర్ల కేసులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేఎన్‌‌యూ ఫ్రొఫెసర్ జయతీ ఘోష్​తో పాటు పలువురు మేధావులు, ప్రొఫెసర్లపై కేసులు పెట్టడాన్ని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఖండించారు. ఇది కేంద్ర హోం శాఖ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ఈ అల్లర్లలో నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల వివరాలు మీడియాలో వచ్చినా చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నీ దీన్ని ఖండించాలని కోరారు. సీఏఏ అల్లర్ల  కేసులో సీతారాం పేరును ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లో పేర్కొనడంపై ఎస్‌‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర కమిటీ హైదరాబాద్‌‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.

 

 

 

Latest Updates