రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్త‌రు వ‌ర్షాలు

తెలంగాణలో రానున్న‌ మూడు రోజుల‌ పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్ర‌భావంతో శ‌ని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా ఆగష్టు 4 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

Latest Updates