పిడుగుల వ‌ర్షం.. 24 గంట‌ల్లో 21 మంది మృతి

బిహ‌ర్ రాష్ట్రంలోని ‌ పలు జిల్లాల్లో శ‌నివారం పిడుగుల వర్షం కురిసింది. పిడుగుల ధాటికి గడిచిన 24 గంటల్లో ఏకంగా 21 మంది మరణించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 21 మంది పిడుగులు ప‌డి మృతిచెందినట్లు బిహార్‌ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ప్రకటించారు. లఖిసరయి, గయ, బంకా, జాముయ్, సమస్తీపూర్, వైశాలీ, నలంద, బోజ్‌పూర్‌ జిల్లాల్లో పిడుగులు పడ్దాయని అధికారులు తెలిపారు.

పిడుగుల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని అందించారు. శుక్రవారం నాడు పిడుగులు పడి ఎనిమిది మంది మరణించారని.. సమస్తీపూర్‌ జిల్లాలో ముగ్గురు, లఖిసరయిలో ఇద్దరు, గయ, బంకా, జామూయ్‌ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని.. ఈ క్రమంలో పిడుగులు పడి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

Latest Updates