ఏటీఎం వాడితే మోతే!..రూ.5 వేలు దాటితే చార్జ్

కస్టమర్లకు ఏటీఎం చార్జీల మోత మోగే అవకాశం కనిపిస్తోంది. రూ.5 వేల కంటే ఎక్కువ విత్‌‌డ్రా చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌‌పై చార్జీని వసూలు చేయాలని ఆర్‌‌‌‌బీఐ కమిటీ సిఫార్స్‌‌ చేసింది. ఏటీఎంల నుంచి విత్‌‌డ్రాయల్స్‌‌ను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుందని కమిటీ అంచనా వేస్తోంది.

న్యూఢిల్లీ: కస్టమర్లకు ఏటీఎం ఛార్జీల మోత మోగే అవకాశం కనిపిస్తోంది. ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఛార్జీలుండవని అనుకుంటే ఇక నుంచి కష్టమే. రూ. ఐదు వేలు కంటే ఎక్కువగా విత్‌‌డ్రా చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌‌పై ఛార్జీని వసూలు చేయాలని ఆర్‌‌‌‌బీఐ కమిటీ ఒకటి సిఫార్స్‌‌ చేసింది. ఏటీఎంల నుంచి పెద్ద మొత్తంలో విత్‌‌డ్రాయల్స్‌‌ను తగ్గించేందుకు ఈ ఛార్జీల పెంపుదల ఉపయోగపడుతుందని ఈ కమిటీ అంచనావేస్తోంది. ఫ్రీ ట్రాన్సాక్షన్లు ఉన్నప్పటికీ ఇండివిడ్యువల్స్‌‌ రూ. 5 వేలు కంటే ఎక్కువ అమౌంట్ విత్‌‌డ్రా చేస్తే బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయాలని ఈ కమిటీ రికమండ్‌‌ చేసింది. ఇండియన్‌‌ బ్యాంక్స్‌‌ అసోసియేషన్‌‌ చీఫ్‌‌ వీజీ కన్నన్‌‌ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ రిపోర్ట్‌‌ గతేడాది అక్టోబర్‌‌‌‌లోనే ఆర్‌‌‌‌బీఐకి అందింది. అయినా దీనిని ఇప్పటిదాకా పబ్లిక్‌‌కి రిలీజ్‌‌ చేయలేదు. ఆర్‌‌‌‌టీఐ కింద ఈ రిపోర్ట్‌‌ వివరాలు బయటపడ్డాయి.

వేరే బ్యాంకు ఏటీఎం వాడితే మోతే….

ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఏటీఎం ఛార్జీలను కూడా ఈ కమిటీ పెంచాలని రికమండ్‌‌ చేసింది. పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న సెంటర్లలో ఫైనాన్షియల్‌‌ ట్రాన్సాక్షన్‌‌పై ఏటీఎం ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఛార్జీని రూ. 2 లు పెంచి రూ. 17 కు తీసుకురావాలని పేర్కొంది. నాన్‌‌ ఫైనాన్షియల్‌‌ ట్రాన్సాక్షన్లయితే ఈ ఛార్జీని రూ. 7 కు పెంచాలని సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాలు, సెమి అర్బన్‌‌ ప్రాంతాలలో ఏటీఎం ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఛార్జీని రూ.3లు పెంచాలని ఈ కమిటీ సిఫార్స్‌‌ చేసింది. ఏటీఎంల ఏర్పాటును ప్రొత్సహించేందుకు ఈ పెంపు ఉపయోగపడుతుందని తెలిపింది.

ఏటీఎం ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఛార్జీలను కస్టమర్‌‌‌‌ బ్యాంక్‌‌ (కార్డును ఇష్యూ చేసిన బ్యాంక్‌‌) మనీ విత్‌‌డ్రా చేసుకున్న ఏటీఎం బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మొదటి బ్యాంక్‌‌ను ఇష్యూయర్‌‌‌‌ అని, రెండో బ్యాంక్‌‌ను అక్వైరర్‌‌‌‌ అని అంటారు. ఈ ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఛార్జీలను అక్వైరర్‌‌ బ్యాంక్‌‌‌‌, ఏటీఎం మెయింటెయిన్‌‌ చేస్తున్న కంపెనీలు పంచుకుంటాయి. అందువల్లనే బ్యాంకులు ఇతర ఏటీఎంలను వాడొద్దంటూ కస్టమర్లకు సూచిస్తుంటాయి. ఏటీఎంలను ఏర్పాటు చేసే కంపెనీలకు ఈ ఛార్జీలే కీలకం. ఈ రిపోర్ట్‌‌ సిఫార్సుల ప్రకారం రూరల్, సెమి అర్బన్‌‌ ఏరియాలలో ఈ ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజు ట్రాన్సాక్షన్‌‌పై రూ. 18 కి పెరుగుతుంది. ప్రస్తుతం ఇది రూ. 15 గా ఉంది. ప్రజలు ఏటీఎంలను వాడడం పెరుగుతోందని, కానీ గత మూడేళ్ల నుంచి కొత్తగా ఏటీఎంలు ఏర్పాటు కాలేదని ఈ కమిటీ పేర్కొంది. ఆపరేటింగ్‌‌ కాస్ట్‌‌ పెరుగుతుండడం, ఏటీఎం యూసేజ్‌‌ ఛార్జీలు, ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజుల్లో మార్పులేకపోవడమే దీనికి కారణమని ఈ కమిటీ అభిప్రాయపడింది.

ట్రాన్సాక్షన్‌‌పై గరిష్టంగా
రూ. 24 ఛార్జీ+ట్యాక్స్‌‌లు

ఏటీఎంల నిర్వహణ ఖర్చులు నానాటికీ పెరుగుతున్నాయని ఈ రిపోర్ట్‌‌ పేర్కొంది. 2012 నుంచి ఇంటర్‌‌‌‌చేంజ్‌‌ ఫీజులు, 2008 నుంచి కస్టమర్ల ఏటీఎం యూసేజ్ ఛార్జీలు పెరగడం లేదని తెలిపింది. సెమి అర్బన్‌‌, గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఏటీఎంల ఏర్పాటు పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఏటీఎం ఛార్జీలను వసూలు చేయడానికి జనాభా సంఖ్యను కొలమానంగా తీసుకోవాలని ఈ రిపోర్ట్‌‌ సిఫార్స్‌‌ చేసింది. పది లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న సెంటర్లలో ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్లను ప్రస్తుతం ఉన్న ఐదు నుంచి ఆరుకు పెంచాలని పేర్కొంది. అదే పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న సెంటర్లలో ఫ్రీ ట్రాన్సాక్షన్ల లిమిట్‌‌ను మూడుగానే కొనసాగించాలని తెలిపింది. ఫ్రీ ట్రాన్సాక్షన్లు అయిపోతే ప్రతి ట్రాన్సాక్షన్‌‌పై గరిష్టంగా రూ. 24 + ట్యాక్స్‌‌ను వసూలు చేయాలని ఈ కమిటీ సిఫార్స్‌‌ చేసింది. ఇది ప్రస్తుతం ఉన్న కస్టమర్‌‌‌‌ అప్పర్‌‌‌‌ ఛార్జీ లిమిట్‌‌ కంటే 20 శాతం ఎక్కువ.

ఢిల్లీలో పెట్రోల్,డిజీల్ ఒకే ధర

 

 

Latest Updates