బ్యాంక్​ అకౌంట్లకు పరిమితులు

  • ఎక్కువ ఉంటే చెప్పాల్సిందే
  • త్వరలో కొత్త చట్టం ?

ఇప్పుడున్న రూల్స్​ ప్రకారం అయితే ఇండియన్​ సిటిజన్లు ఎన్ని బ్యాంకుల్లో అయినా ఖాతాలు తెరవొచ్చు. ఖాతాలపై పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే ఇక నుంచి ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఖాతాల సంఖ్యకు పరిమితి విధిస్తూ ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టాన్ని తెచ్చే అవకాశం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకు ఖాతాలు రెండు రకాలు ఒకటోది.. బిజినెస్ లేదా కరెంటు ఖాతా. మాన్యుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్​, ఇతర వ్యాపార సంస్థలు ఈ రకం ఖాతాలు తీసుకుంటాయి. ఇవి వివిధ ఖాతాలు ఉన్న కస్టమర్లకు డబ్బులు చెల్లించాలి  కాబట్టే ఎక్కువ ఖాతాలను తెరుస్తాయియి. కొత్త చట్టం ప్రకారం వ్యాపార సంస్థలు ఇక నుంచి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవొచ్చు. అయితే వాటి వివరాలను ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. వాటి అవసరమేంటో చెప్పాలి. రెండోది సేవింగ్స్‌‌/శాలరీ అకౌంట్‌‌. దీనిని డాక్టర్​, లాయర్ వంటి ప్రొఫెషనల్స్​, ఉద్యోగులు, సాధారణ వ్యాపార సంస్థలు తీసుకుంటాయి. ఇలాంటి వారు ఎక్కువ ఖాతాలను తెరవడానికి అనుమతి ఇవ్వరు. వీళ్లు ఎన్ని ఖాతాలు కొనసాగించాలనే విషయమై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

ఈ రూల్​ ఎందుకంటే…

ఉత్తరప్రదేశ్​ నగరం ఘజియాబాద్​ వాసి ఒకరు ఓరియెంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​, ఆక్సిస్​ బ్యాంకులో 87కుపైగా బ్యాంకు ఖాతాలు తెరిచాడు. వీటి ద్వారా రూ.380 కోట్లను అక్రమంగా ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. ఇదంతా చూసిన పన్నుల విభాగం అధికారులు కంగు తిన్నారు. అందుకే వ్యక్తులకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండకుండా నియంత్రించాలని ఐటీశాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొందరు వివిధ నగరాల బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నట్టు కూడా గుర్తించారు. అక్రమాలకు పాల్పడటానికే ఇలా చేస్తున్నారని అనుమానిస్తున్న ఐటీ ఆఫీసర్లు.. ఈ పద్ధతిని ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘‘ఇక నుంచి ప్రతి బ్యాంకు ఖాతాల వివరాలను ఐటీశాఖ, జీఎస్టీ ఆఫీసర్లకు ఇవ్వాలి. ఈ విధానం వల్ల… ఎవరైనా వివిధ ప్రాంతాల్లో ఖాతాలు తెరిస్తే అధికారులకు సమాచారం వస్తుంది. ఏవైనా అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తిస్తే తదుపరి చర్యలు తీసుకోవచ్చు”అని ఐటీశాఖ విడుదల చేసిన సర్కులర్​ పేర్కొంది.

limitations to bank accounts for indian citizens

Latest Updates