రోడ్డుపై వాహ‌నాల‌కు అడ్డుగా ప‌డుకున్న సింహాలు.. ట్రాఫిక్ జామ్: వీడియో వైర‌ల్

రోడ్డుపై రెండు సింహాలు హాయిగా సేద‌తీరుతూ ప‌డుకున్నాయి. వాటిని దాటుకుని వెళ్లేందుకు ఎవ‌రూ ధైర్యం చేయ‌లేకపోయారు. వ‌స్తున్న వాహ‌నాల‌న్నీ ఒక‌దాని వెనుక మ‌రొక‌టి నిలిచిపోయాయి. వ‌రుస‌గా వెహిక‌ల్స్ రావ‌డంతో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాటి మ‌ధ్య‌లో నుంచి న‌డుచుకుంటూ మ‌రో సింహం వాటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆ మృగ‌రాజులు ఎప్పుడు క‌దిలి వెళ్తాయోన‌ని ఎదురు చూస్తూ నిలిచిపోయారు టూరిస్టులు. ఆఫ్రికాలోని ఓ స‌ఫారీలో జ‌రిగిన ఘ‌ట‌నకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వైల్డ్ లైఫ్ ను ట్రాఫిక్ డిస్ట‌ర్బ్ చేస్తుంటే.. ఫ‌ర్ ఏ చేంజ్.. ఇక్క‌డ వ‌న్య జీవులు ట్రాఫిక్ జామ్ చేశాయి అన్న ట్యాగ్ లైన్ తో ఆయ‌న సోమ‌వారం ఈ వీడియోను ట్వీట్ చేశారు.

హాయిగా రిలాక్స్ అవుతున్నాయ్

ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఒక్క రోజులోనే 27 వేల మంది ఈ వీడియోను చూశారు. 800 మందికి పైగా దానిని లైక్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజ‌న్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. సింహాలు రివ‌ర్స్ రోల్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాయంటూ ఓ నెటిజ‌న్ అన్నాడు. స‌ఫారీకి వెళ్లిన టూరిస్టుల‌కు ఇంత‌క‌న్నా మంచి మూమెంట్ ఏముంటుంది అని మ‌రో వ్య‌క్తి కామెంట్ చేశాడు. ఆ ప్లేస్ లో ప్ర‌తి అంగుళం వాటి సొంతం. ప్ర‌కృతి వాటికి ఇచ్చిన ఇంట్లో అవి హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ఈ భూమి చాలా స్పెష‌ల్ అని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

Latest Updates